రమదాన్ విరామం.. 72 గంటలు కాల్పులు విరమణ!
- July 06, 2016
పవిత్ర రమదాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని 72 గంటలపాటు కాల్పులు జరపకూడదని సిరియా ఆర్మీ నిర్ణయించుకుంది. దేశ వ్యాప్తంగా ఈ కాల్పుల విరమణ నిర్ణయం అమలులో ఉంటుందని ఓ అధికారి వెల్లడించారు. జూలై 6 వేకువజామున ఒంటి గంట నుంచి జూలై 8 అర్ధరాత్రి వరకు కాల్పులు నిషేధించారు. ముస్లింలు రమదాన్ పండుగ నేపథ్యంలో ఆయుధాలకు దూరంగా ఉండాలని ఆర్మీ భావించిందని, అందుకే అధికారికంగా తమ నిర్ణయాన్ని ప్రకటించారు.
అయితే గత ఫిబ్రవరిలో రష్యా, అమెరికా ఆర్మీ కాల్పుల విరమణ ప్రకటించినా.. అనివార్య కారణాల వల్ల ఆర్మీ కాల్పులు జరిపిన విషయం అందరికీ విదితమే. తిరుగుబాటు దారులపై కాల్పులకు తాత్కాలికంగా గుడ్ బై చెప్పారా.. లేక ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై కాల్పులకు ఈ నిషేధ ఆజ్ఞలు వర్తిస్తాయా అనే అంశంపై స్పష్టత లేదు.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







