హోటల్ పెట్టిన మంచు అక్క.!
- July 06, 2016
నటిగా, యాంకర్ గా, వ్యాపారవేత్తగా ఆమె ఎన్నో రంగాలలో మంచు లక్ష్మీప్రసన్న తనదైన ముద్రవేశారు. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కూతురు, నటి మంచు లక్ష్మీప్రసన్న నటనతో ఇప్పటికే మంచి మార్కులు కొట్టేశారు. భర్త ఆండీ శ్రీనివాసన్ తో కలిసి మంచు లక్ష్మీ ఓ రెస్టారెంట్ ప్రారంభించారు. ఆండీ శ్రీనివాసన్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఈ దంపతులు ఓ రెస్టారెంట్ ను 'జూనియర్ కుప్పన్న' పేరుతో హైటెక్ సిటీలో స్టార్ట్ చేశారు.అయితే ఈ హోటల్స్ ఇప్పటికే గ్రూపులుగా ఉన్నాయని, తమిళనాడు, కర్ణాటకలో బ్రాంచులు ఉన్నట్లు సమాచారం. ప్రధాన బ్రాంచులు తమిళనాడులో ఉన్నాయి. మంచు మోహన్ బాబు తన కుటుంబంతో కలిసి రెస్టారెంటు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. విష్ణు దంపతులు వారి పిల్లలు, మంచు మనోజ్ దంపతులు, లక్ష్మీ, ఆండీ ఇతర కుటుంబసభ్యులు మనకు ఈ ఫొటోలో కనిపిస్తున్నారు. తమ సోదరి ఈ వ్యాపారంలో రాణించాలని సోదరులు విష్ణు, మనోజ్ లు లక్ష్మీ దంపతులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆండీ దంపతులను మోహన్ బాబు ఆశీర్వదించారు. పిల్లలతో సహా మంచు వారి కుటుంబసభ్యులు ఒకేచోట చేరడంతో అక్కడ సందడి వాతావరణం కనిపించింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







