కన్సల్టెంట్ కు BD7,000 పరిహారం..లేబర్ కోర్టు సంచలన తీర్పు..!!

- April 06, 2025 , by Maagulf
కన్సల్టెంట్ కు BD7,000 పరిహారం..లేబర్ కోర్టు సంచలన తీర్పు..!!

మనామా: ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి చట్టవిరుద్ధంగా తొలగించిన కన్సల్టెంట్‌కు దాదాపు BD7,000 వేతనాలు , పరిహారం చెల్లించాలని హై లేబర్ కోర్టు తీర్పు ఇచ్చింది. అతడు పనిచేస్తున్న ప్రాజెక్టులను అర్ధాంతరంగా రద్దు చేయడంతో నెలకు BD500 చొప్పున ఒప్పందం కింద పనిచేస్తున్న కన్సల్టెంట్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అతని బకాయిలకు సంబంధించి సమస్యలను పరిష్కరించడానికి బదులుగా, కంపెనీ చెల్లింపు లేకుండా అతని ఉద్యోగాన్ని రద్దు చేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఆర్థిక ఇబ్బందులతో ప్రాజెక్ట్ రద్దు చేసినట్లు కంపెనీ వాదనను కోర్టు తిరస్కరించింది. ఆ సంస్థ వేతనం కింద BD2,000 చెల్లించాలని, సంవత్సరానికి ఆరు శాతం వడ్డీతో, ఆరు నెలల తర్వాత నెలకు ఒక శాతం చొప్పున, గరిష్టంగా పన్నెండు శాతం వరకు చెల్లించాలని తీర్పు ఇచ్చింది.  తప్పుడు తొలగింపుకు BD4,250, వార్షిక సెలవు బకాయిలకు BD226, సర్వీస్ ముగింపు గ్రాట్యుటీగా BD143, నోటీసుకు బదులుగా BD83 పరిహారం చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. అలాగే సంస్థ తిరిగి వచ్చేందుకు బాధితుడికి విమాన టికెట్ ను కూడా అందించాలి, ఉపాధి ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాలని ఆదేశించింది.

కాగా, సాక్షుల కథనం ప్రకారం.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కంపెనీ అనేక మంది ఇతర ఉద్యోగులను తొలగించిందని న్యాయమూర్తి అంగీకరించారు. అయితే, ఆర్థిక ఇబ్బందులు యజమాని ఒప్పంద బాధ్యతలను నెరవేర్చకుండా మినహాయించవని కోర్టు స్పష్టం చేసింది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com