కుప్పకూలిన సౌదీ స్టాక్ మార్కెట్..హాఫ్ ట్రిలియన్ రియాల్స్ నష్టం..!!

- April 07, 2025 , by Maagulf
కుప్పకూలిన సౌదీ స్టాక్ మార్కెట్..హాఫ్ ట్రిలియన్ రియాల్స్ నష్టం..!!

రియాద్:  అమెరికా-చైనా సుంకాల వార్ తో  ఏర్పడిన వాణిజ్య యుద్ధం ప్రారంభమైన తరువాత గల్ఫ్ దేశాల స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. సౌదీ స్టాక్ మార్కెట్ అర ట్రిలియన్ రియాల్స్ మార్కెట్ విలువను కోల్పోయింది. గల్ఫ్ మార్కెట్‌లో పతనం కూడా వారాంతంలో చమురు ధరలు, ప్రపంచ స్టాక్ ఎక్స్ఛేంజీలలో తగ్గుదలతో సమానంగా ఉంది.

సౌదీ అరేబియా  బెంచ్‌మార్క్ తడావుల్ ఆల్ షేర్ ఇండెక్స్ (TASI) 700 పాయింట్లకు పైగా (6.1 శాతం) పడిపోయి 11,200 పాయింట్ల దిగువకు చేరుకుంది. సౌదీ అరామ్‌కో షేర్లు నష్టాలలో అత్యధిక భాగాన్ని కలిగి ఉన్నాయి. దాని మార్కెట్ విలువ SR340 బిలియన్లకు పైగా పడిపోయింది. గల్ఫ్ స్టాక్ సూచీలు కూడా సమిష్టిగా క్షీణించాయి. ఖతార్, కువైట్, మస్కట్, బహ్రెయిన్ మార్కెట్లు సైతం భారీ పతనాలను నమోదు చేశాయి.

అరాంకో షేర్లు 6.2 శాతం పడిపోయాయి.  ఆ తర్వాత అల్ రాజ్హి బ్యాంక్, ACWA పవర్, సౌదీ నేషనల్ బ్యాంక్ 5 నుండి 6 శాతం వరకు తగ్గాయి.  గల్ఫ్ స్టాక్ సూచీలు.. అలాగే ఈజిప్షియన్ , జోర్డాన్ స్టాక్ ఎక్స్ఛేంజీలు వారాన్ని సమిష్టి నష్టాలతో ప్రారంభించాయి. కువైట్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 6.6 శాతం క్షీణతను నమోదు చేసింది. ఖతార్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక 5.5 శాతం పడిపోయింది. ఇది మార్చి 2020 తర్వాత అతిపెద్ద క్షీణతగా నిపుణులు పేర్కొంటున్నారు. మస్కట్ సెక్యూరిటీస్ మార్కెట్ ఇండెక్స్ 2.1 శాతం తగ్గగా, బహ్రెయిన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్ సుమారు 2.5 శాతం పడిపోయింది. ఆదివారం సెలవు దినంకావడంతో యూఏఈలోని స్టాక్ మార్కెట్లు పనిచేయలేదు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com