బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- November 09, 2025
మనామా: బహ్రెయిన్ మొత్తం భూ విస్తీర్ణం 787.79 చదరపు కిలోమీటర్లకు చేరుకుంది. ఈ మేరకు సర్వే అండ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ బ్యూరో (SLRB) తాజా అధికారిక డేటా విడుదల చేసింది. జాతీయ ఓపెన్ డేటా ప్లాట్ఫామ్లో ప్రచురించబడిన గణాంకాల ప్రకారం, 2023తో పోలిస్తే రాజ్య భూభాగం ఒక చదరపు కిలోమీటర్ పెరిగిందని, గత ఐదు సంవత్సరాలలో మొత్తం 4.8 చదరపు కిలోమీటర్ల పెరుగుదల నమోదు అయిందని తెలిపింది. 2019లో, బహ్రెయిన్ భూభాగం సుమారు 783 చదరపు కిలోమీటర్లుగా నమోదైంది.
బహ్రెయిన్ ప్రాదేశిక జలాలు దాదాపు 7,481 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఇది 2016 నుండి మారలేదని తెలిపింది. గత తొమ్మిది సంవత్సరాలలో, బహ్రెయిన్ మొత్తం భూభాగం దాదాపు ఎనిమిది చదరపు కిలోమీటర్లు విస్తరించింది.
గవర్నరేట్ల వారీగా చూస్తే.. దక్షిణ గవర్నరేట్ అతిపెద్దదిగా ఉంది, ఇది 488.77 చదరపు కిలోమీటర్లు లేదా బహ్రెయిన్ మొత్తం భూభాగంలో 62% కలిగి ఉంది. దాని తర్వాత 145.69 చదరపు కిలోమీటర్లతో నార్తర్న్ గవర్నరేట్, 79.23 చదరపు కిలోమీటర్లతో కాపిటల్ గవర్నరేట్ మరియు 74.1 చదరపు కిలోమీటర్లతో ముహారక్ గవర్నరేట్ ఉన్నాయని నివేదికలో వెల్లడించారు.
తాజా వార్తలు
- పిల్లలు, తల్లిదండ్రుల కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఉచిత ఆన్లైన్ డెమో సెషన్
- సౌదీ అరామ్కో భవనాన్ని పరిశీలించిన డిప్యూటీ ఎమిర్..!!
- ఖతార్‌లో ప్రైవేట్ స్కూల్స్, కిండర్గార్టెన్లకు కొత్త మార్గదర్శకాలు..!!
- COP31 సదస్సులో ఒమన్..2050 నాటికి నెట్‌జీరోకు కృషి..!!
- కువైట్‌లో వాహనదారులకు ట్రాఫిక్ సేవలు మరింత సులభతరం..!!
- బహ్రెయిన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కౌన్సిల్ కీలక నిర్ణయం..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ నిబంధనలు.. మార్పులివే..!!
- కన్ఫామ్ టికెట్ లేకుంటే వందే భారత్ ఎక్కలేరు
- తాజా ప్రాంతీయ పరిస్థితులపై సౌదీ, ఒమన్ చర్చలు..!!
- హమద్ విమానాశ్రయంలో ఉచితంగా షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శన..!!







