కొత్త కార్ స్కామ్..సెలబ్రిటీల ప్రచారం..అధికారుల హెచ్చరిక..!!
- April 07, 2025
మనామా: బహ్రెయిన్‌లో కార్ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త మోసపూరిత పథకం గురించి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ-కరప్షన్ & ఎకనామిక్ & ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ బహిరంగ హెచ్చరిక జారీ చేసింది. మోసగాళ్ళు సెలబ్రిటీల వలె నటించి వ్యక్తులను మోసగించి, తప్పుడు సాకులతో కార్లను కొనుగోలు చేయమని మోసగిస్తున్నట్లు తెలిపింది.
మోసగాళ్ళు బహ్రెయిన్ లో ప్రముఖులుగా నటిస్తూ బాధితులను నేరుగా సంప్రదిస్తారు.వారు పొరుగు దేశాల నుండి దిగుమతి చేసుకున్నట్లు వాహనాలు ఉన్నాయని నమ్మబలుకుతారు. వాటిని "ప్రత్యేక ఒప్పందం" లేదా వారి అనుమానిత కనెక్షన్ల ద్వారా సాధ్యమయ్యే "జీవితంలో ఒకసారి వచ్చే అవకాశం"గా బిల్డప్ ఇస్తారు.
ఈ ఆఫర్లు పూర్తిగా నకిలీవని, మోసగించబడుతున్న వ్యక్తులకు స్కామర్లతో లేదా ఈ లావాదేవీలతో ఎటువంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. మోసం ద్వారా కొనుగోలుదారుల నుండి డబ్బును దొంగిలించడమే లక్ష్యంగా చేసుకుంటారని తెలిపారు.
ముఖ్యమైన భద్రతా చిట్కాలు:
అధికారిక ధృవీకరణ లేకుండా ప్రముఖులు లేదా ప్రభావవంతమైన వ్యక్తులమని చెప్పుకునే వ్యక్తుల నుండి వచ్చే అవాంఛిత కాల్‌లను నమ్మవద్దు.
ఒప్పందం చట్టబద్ధతను పూర్తిగా నిర్ధారించే వరకు ఎప్పుడూ డబ్బును బదిలీ చేయవద్దు.
ఇటువంటి అనుమానాస్పద, అనధికారిక మార్గాల్లో నిర్వహించే ఏవైనా అమ్మకాలు స్కామ్‌లుగా మారే అవకాశం ఉంది.
సంబంధిత సంఘటనలను నివారించడానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ హెచ్చరికను కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవాలని సూచించింది.
అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించండి:
హాట్‌లైన్: 992 (జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ-కరప్షన్ & ఎకనామిక్ & ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ)
తాజా వార్తలు
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!







