రియాద్‌లో ఇళ్లలో చోరీలు..దారి దోపిడీలు.. 21 మంది అరెస్ట్..!!
- April 07, 2025
రియాద్: రియాద్ పోలీసుల క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం 18 మంది యెమెన్ పౌరులు, ముగ్గురు సౌదీ పౌరులు సహా 21 మందిని అరెస్టు చేసింది. వీరిలో దారిదోపిడీలు, ఇళ్లలో దొంగతనం చేసిన వారు ఉన్నారు. నిందితులు వివిధ ముఠాలుగా ఏర్పడి చోరీలు, దోపిడీలకు పాల్పడే వారని పోలీసులు తెలిపారు. ఇందు కోసం ముఠా సభ్యులు ప్రత్యేక భద్రతా పరికరాలు అమర్చిన వాహనాలను ఉపయోగించి నేరాలకు పాల్పడ్డారని వివరించారు. అరెస్టు చేసిన వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలను తీసుకున్న తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!







