ఏపీకి మరో గుడ్ న్యూస్!
- April 08, 2025
న్యూ ఢిల్లీ: భారతదేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో దేశంలో మరో మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ నిర్మాణానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం అనువైన ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుంది. ఇందులో భాగంగానే 2011లో ఏపీకి ఈ ప్రాజెక్టును కేటాయించింది. అప్పట్లోనే ఈ మిస్సైల్ సెంటర్ నిర్మాణానికి కృష్ణా జిల్లాలోని నాగాయలంక మండలం గుల్లలమోద గ్రామం అనువైన ప్రాంతంగా కేంద్రప్రభుత్వం గుర్తించింది. ఈ గ్రామం సముద్రతీర ప్రాంతంలో ఉండటం, గ్రామం చుట్టుపక్కల 6-8కిలోమీటర్ల మేర ఎలాంటి జనావాసాలు లేకపోవడంతో మిస్సైల్ టెస్టింగ్ ప్రయోగాలకు ఈ గ్రామం అనుకూలంగా ఉంటుందనే భావనకు వచ్చారు. అయితే అప్పుడే ప్రాజెక్టుకు భూమిని కేటాయించాలని డీఆర్డీవో అధికారులు కొరగా ..రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇది కాస్తా ఆలస్యమైంది. ఇక ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత 2017లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం 300 ఎకరాలకుపైగా భూమిని డీఆర్డీవో కు కేటాయించింది. అయితే పర్యావరణ అనుమతులు మరియు ఇతర అడ్డంకుల కారణంగా కొన్నేళ్లపాటు ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైంది. దీంతో 2019లో పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు లభించడంతో 2021లో ఆ స్థలాన్ని డీఆర్డీవో స్వాధీనం చేసుకొంది.
ప్రాజెక్టుకు కేటాయించిన ప్రాంతం చుట్టూ ప్రహారి గోడను నిర్మించింది. కానీ ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన మాత్రం జరగలేదు. అయితే ఈ ఏడాది జనవరిలోనే ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో ఈ కేంద్రానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేయగా.. చివరి నిమిషంలో రద్దైనట్టు అధికారులు తెలిపారు. ఇది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కావడంతో ప్రధాని మోదీయే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. అయితే అమరావతి నిర్మాణ పనుల శంకుస్థాపనతో పాటు ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను కూడా మోదీ ప్రారంభించనున్నట్టు సమాచారం. ఈ మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ నిర్మాణం పూర్తయితే, ఇది ఒడిశాలోని బాలాసోర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ తర్వాత భారతదేశంలో రెండవ ప్రధాన క్షిపణి పరీక్షా కేంద్రంగా మారుతుంది. ఇది షార్ట్-రేంజ్ మరియు లాంగ్-రేంజ్ క్షిపణుల పరీక్షలకు సహాయపడుతుంది, దీనివల్ల భారత రక్షణ రంగంలో స్వావలంబన మరియు సాంకేతిక పురోగతి సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్టు స్థానికంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని ఏపీ ప్రజలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
తాజా వార్తలు
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్