కార్లను దొంగిలించి, పార్టులుగా విప్పి సేల్.. ముఠా అరెస్ట్..!!
- April 09, 2025
కువైట్: వాహనాలను దొంగిలించి, విడిభాగాలుగా విక్రయించినందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు సభ్యుల ఈజిప్షియన్ ముఠాను అధికారులు అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యులను భద్రతా దళాలు ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి కార్ల విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు. వారు టో ట్రక్కులను ఉపయోగించి వాహనాలను సల్మి స్క్రాప్ ప్రాంతంలోని గ్యారేజీకి తరలించారని, అక్కడ వారు వాటిని విడదీసి, విడిభాగాలను విక్రయించారని.. వారి నేరాలను దాచడానికి, వారు కారు బాడీలను కూడా డెస్ట్రాయ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ముఠా కార్యాక్రమాల గురించిన సమాచారం అందగానే అహ్మదీ గవర్నరేట్ దర్యాప్తు విభాగం ట్రాకింగ్ మొదలుపెట్టిందని పేర్కొన్నారు. రెడ్ హ్యాండెండ్ గా దొంగిలించిన కార్లు, వాటి విడిభాగాలను సీజ్ చేశారు. అనుమానాస్పద ఘటనలపై సమాచారాన్ని నివేదించమని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







