2024లో లైసెన్స్ పొందిన ఆతిథ్య సౌకర్యాలలో 89% వృద్ధి..!!

- April 10, 2025 , by Maagulf
2024లో లైసెన్స్ పొందిన ఆతిథ్య సౌకర్యాలలో 89% వృద్ధి..!!

రియాద్: సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాలలో లైసెన్స్ పొందిన పర్యాటక ఆతిథ్య సౌకర్యాల సంఖ్య 4,425కి చేరుకుందని, ఇది 2024లో 89 శాతం వృద్ధిని నమోదు చేసిందని ప్రకటించింది.  పర్యాటక రంగంలో గణనీయమైన వృద్ధి, సందర్శకుల ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు సేవలను పెంచాలనే మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. 

హాస్పిటాలిటీ రంగంలో ఆపరేటర్లు,, పెట్టుబడిదారులు కార్యకలాపాలకు అవసరమైన లైసెన్స్‌లను పొందేందుకు మంత్రిత్వ శాఖ సహాయం చేయనుంది. ఇది లైసెన్సింగ్ ప్రమాణాలకు ఆతిథ్య సౌకర్యాల నిబద్ధతను పెంచడం, పర్యాటక చట్టం,  దాని నిబంధనల ద్వారా నిర్దేశించబడిన అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com