సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్‌ కు ఫుల్ డిమాండ్..!!

- January 12, 2026 , by Maagulf
సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్‌ కు ఫుల్ డిమాండ్..!!

రియాద్: సౌదీ అరేబియా ట్రాన్స్‌పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) ఆదివారం విడుదల చేసిన త్రైమాసిక గణాంకాల బులెటిన్ ప్రకారం.. 2025 నాల్గవ త్రైమాసికంలో సౌదీ అరేబియాలో రైడ్-హెయిలింగ్ యాప్‌ల ద్వారా నమోదైన ప్రయాణికుల సంఖ్య 43 మిలియన్లను అధిగమించిందని, ఇది గత సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 54.26 శాతం పెరుగుదల అని పేర్కొంది. నగరాల్లో రవాణాకు ప్రాధాన్య పద్ధతిగా రైడ్-హెయిలింగ్ యాప్‌లపై ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. 

సౌదీ అరేబియా ప్రాంతాల విషయానికొస్తే జరిగిన మొత్తం ప్రయాణాలలో 44.56 శాతం వాటాతో రియాద్ అగ్రస్థానంలో ఉందని అథారిటీ తెలిపింది. ఇక మక్కా 21.89 శాతంతో రెండవ స్థానంలో, తూర్పు ప్రావిన్స్ 14.20 శాతంతో మూడవ స్థానంలో, మదీనా 5.94 శాతంతో నాల్గవ స్థానంలో మరియు ఆసిర్ 3.2 శాతంతో ఐదవ స్థానంలో ఉన్నాయి.  ఆసిర్ తర్వాత అల్-ఖస్సిమ్ 2.95 శాతంతో, తబూక్ 2.39 శాతంతో, హైల్ 1.83 శాతంతో, జాజాన్ 1.24 శాతంతో, నజ్రాన్ 0.67 శాతంతో, అల్-జౌఫ్ 0.57 శాతంతో, ఉత్తర సరిహద్దుల ప్రాంతం 0.32 శాతంతో మరియు అల్-బాహా 0.23 శాతంతో ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com