BD1 ఛార్జీల విషయంలో గొడవ.. డ్రైవర్ ఘాతుకం.. మహిళ మృతి..!!

- April 10, 2025 , by Maagulf
BD1 ఛార్జీల విషయంలో గొడవ.. డ్రైవర్ ఘాతుకం.. మహిళ మృతి..!!

మనామా: BD1 ఛార్జీల విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ఓ మహిళ తన ప్రాణాలను కోల్పోయింది. కదులుతున్న కారు తలుపును గట్టిగా పట్టుకోవడంతో, కారు ఆమెను రోడ్డుపైకి ఈడ్చుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆస్పత్రిల్లో చేర్పించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించింది.  అరబ్ వ్యక్తి అయిన డ్రైవర్‌కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అతని శిక్ష ముగిసిన తర్వాత బహిష్కరించబడతాడు.

ఈ సంఘటన గత సంవత్సరం డిసెంబర్ 6 తెల్లవారుజామున జరిగింది.ఆ మహిళ , మరో ఇద్దరు తెల్లవారుజామున 2 గంటల వరకు ఒక హోటల్‌లో ఉన్నారు. BD3 మాట్లాడుకొని కారులో వచ్చారు. కానీ దూరం తక్కువగా ఉందని మహిళల్లో ఒకరు వాదించి BD2 ఇచ్చారు. గొడవ జరిగింది.  కాగా, వివాదం సమయంలో ఆ వ్యక్తి మహిళలను అవమానించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిలో మృతురాలు కారు తలుపు పట్టుకోకువంది. ఆపడానికి బదులుగా, డ్రైవర్ వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ మహిళ పట్టు కోల్పోయి, కిందపడి, తీవ్రంగా గాయపడ్డది. ఆమెను ఆసుపత్రికి తరలించారు కానీ నాలుగు రోజుల తర్వాత తలకు గాయాలు , ఎముకలు విరిగిపోవడంతో మరణించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com