హవల్లిలో స్పెషల్ చెకింగ్ డ్రైవ్స్.. కఠినమైన జరిమానాలు..!!
- April 10, 2025
కువైట్: వ్యాపారాలు స్థానిక నిబంధనలను పాటిస్తున్నాయని నిర్ధారించుకోవడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా.. కువైట్ మునిసిపాలిటీ హవల్లి శాఖ 50 దుకాణాలలో తనిఖీలు చేశారు. వాటిలో నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడిన 28 దుకాణాలకు నోటీసులు జారీ చేశారు. డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ మహమ్మద్ అల్-సుబై ప్రకారం.. ఉల్లంఘనలలో ఇప్పటికే ఉన్న ప్రకటనల నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రకటన లైసెన్స్‌లను పునరుద్ధరించకపోవడం, అనుమతి లేకుండా ప్రకటనలు లేదా ప్రచార సంకేతాలను ఉంచడం ఉన్నాయి. జరిమానాలను నివారించడానికి అన్ని దుకాణ యజమానులు తమ వ్యాపారం, ప్రకటన లైసెన్స్‌లను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలని అల్-సుబై గుర్తు చేశారు. మెరుగైన సమ్మతిని ప్రోత్సహించడానికి , ప్రజా ప్రయోజనాలను కాపాడటానికి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయని, భారీగా జరిమానాలు విధిస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం