ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- February 25, 2026
హైదరాబాద్: అడోబ్ (Adobe) సీఈవో, ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ బోర్డు సభ్యుడు శంతను నారాయణ్ హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్ర భవిష్యత్తు, పారిశ్రామికాభివృద్ధి మరియు సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులపై వీరిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రస్తుత ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగ రంగంపై చూపుతున్న ప్రభావం గురించి శంతను నారాయణ్ మరియు ముఖ్యమంత్రి ప్రధానంగా చర్చించారు. తెలంగాణను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా మార్చడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గ్లోబల్ ట్రెండ్స్, గ్రీన్ ఎనర్జీ ,కొత్త పారిశ్రామిక అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విజన్‌ను పంచుకున్నారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







