నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- February 25, 2026
జెరూసలేం: రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం Israelకు చేరుకున్నారు. టెల్ అవీవ్‌లోని బెన్-గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఆ దేశ ప్రధాని Benjamin Netanyahu స్వయంగా విచ్చేసి ఘన స్వాగతం పలకడం విశేషంగా నిలిచింది. ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి స్వాగతం పలకడం ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను ప్రతిబింబించింది.
2017లో తొలిసారి ఇజ్రాయెల్ పర్యటించిన మోదీ, దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ఆ దేశాన్ని సందర్శించడం భారత్–ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతున్న సంకేతంగా భావిస్తున్నారు.
ఈ పర్యటనలో భాగంగా మోదీ ఇజ్రాయెల్ పార్లమెంట్ Knessetను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సభలో ప్రసంగించే తొలి భారత ప్రధానిగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నెస్సెట్ భవనాన్ని భారత త్రివర్ణ పతాక రంగులతో అలంకరించడం విశేషం.
ఇరువురు నేతలు పశ్చిమాసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. రేపు జరగనున్న ఉన్నత స్థాయి సమావేశంలో ఆర్థిక, భద్రత, రక్షణ, సాంకేతికత, వ్యవసాయం వంటి రంగాల్లో కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రక్షణ సాంకేతికత సహకారం, ఇన్నోవేషన్ భాగస్వామ్యం కీలక అంశాలుగా ఉండనున్నాయి.
మోదీ పర్యటనను పురస్కరించుకుని ఇజ్రాయెల్ మీడియా “నమస్తే… షాలోమ్” అంటూ ప్రత్యేక కథనాలతో స్వాగతం పలికింది. మోదీ–నెతన్యాహు మధ్య వ్యక్తిగత స్నేహం రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య బలమైన బంధానికి ప్రతీకగా నిలుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఈ పర్యటనలో భాగంగా మోదీ ప్రవాస భారతీయులతో కూడా సమావేశం కానున్నారు.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







