పిడుగుపడి 27 మంది మృతి..
- April 11, 2025
పాట్నా: బీహార్ లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఏకంగా 27 మందిని పొట్టన పెట్టుకున్నాయి.గురువారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. పిడుగుపాటుతో 27 మంది మరణించారు. ఒక్క నలంద జిల్లాలోనే 20 మంది మృతి చెందారు. సివాన్‌లో ఇద్దరు చనిపోయారు. కఠిహార్, దర్భంగా, బెగుసరాయ్, భాగల్‌పుర్, జహానాబాద్‌లలో ఒక్కో మరణం నమోదైంది. బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి నితీశ్ సానుభూతి తెలిపారు. ఒక్కో కుటుంబానికి 4 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు.
బుధవారం కూడా ఇదే తరహాలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం 27 మంది మరణించారు. మరికొన్ని రోజులు ఈ తరహా వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రతి సంవత్సరం పిడుగులతో బీహార్ లో ఎక్కువ మంది చనిపోతున్నారు. 2023లో ఒక్క ఏడాదిలోనే పిడుగుపాటు ఘటనల్లో 275 మంది మరణించారు.
పశ్చిమ బీహార్ నుండి తూర్పు బీహార్ వరకు చాలా తీవ్రమైన ఉష్ణప్రసరణ వ్యవస్థ (ఉరుములు వంటివి) చాలా వేగంగా కదులుతోంది” అని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిక జారీ చేసిన కొద్దిసేపటికే ఈ మరణాలు సంభవించాయి. ముందు జాగ్రత్త చర్యగా సాయంత్రం 6.13 గంటల వరకు నివాసితులు ఇళ్లలోనే ఉండాలని ఆ శాఖ సూచించింది.
ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన పత్రికా ప్రకటన ప్రకారం నలందలో 20 మంది, సివాన్‌లో ఇద్దరు.. కతిహార్, దర్భంగా, బెగుసరాయ్, భాగల్పూర్, జెహానాబాద్‌లలో ఒక్కొక్కరు పిడుగుపాటుతో మరణించారు. నలందలో నాగవాన్ గ్రామంలోనే ఏడుగురు మరణించినట్లు సమాచారం. తుఫాను సమయంలో ఆశ్రయం పొందుతున్నప్పుడు ఒక చెట్టు కూలి ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు వారు ఆశ్రయం పొందుతున్న భవనం గోడ కూలి చనిపోయారు.
నలంద జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. రోడ్లకు అడ్డుగా నిలిచి, రాకపోకలకు అంతరాయం కలిగించిన చెట్లను తొలగించేందుకు 54 బృందాలను మోహరించారు. తీవ్రమైన వాతావరణం విద్యుత్ మౌలిక సదుపాయాలను కూడా దెబ్బతీసింది. 320 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి 42 బృందాలు పని చేస్తున్నాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







