కోమలి సూసైడ్: పోలీసుల అదుపులో ప్రియుడు
- February 27, 2026
హైదరాబాద్: సోషల్ మీడియాలో తనదైన శైలిలో వీడియోలు చేస్తూ ఎంతోమంది అభిమానం సంపాదించుకున్న యువ యూట్యూబర్ కోమలి(21) ఆత్మహత్యకు పాల్పడింది.మణికొండలోని చిత్రపురి కాలనీలో తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కోమలి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆమె ప్రియుడు అఖిల్ రెడ్డితో విభేదాలు రావడంతో ఏడాది క్రితం ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో భాగంగా.. కోమలి ప్రియుడు అఖిల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆత్మహత్యకు ముందు కోమలి..ఓ సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ లెటర్‌లో ‘నేను జీవితంలో ముందుకు సాగడానికి భయపడుతున్నా.. అతను నా వాడు కాదనీ తెలుసు. అతను నాతో ఉండటానికి కూడా ప్రయత్నించడం లేదు. కానీ నా హృదయం అతని కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉంది..ఇంకా ఆశిస్తూనే ఉంది. ఏదో ఒకరోజు అతను నన్నే ఎంచుకుంటాడని నా మనసు చెబుతోంది. అందుకే ముందుకు సాగడం అసాధ్యంగా అనిపిస్తోంది. ఎందుకంటే నేను చివరికి వెనక్కి తిరిగి నడిచివెళ్లిన క్షణంలో.. అతను తిరిగొచ్చి నన్ను వెతికితే...’ అని రాసుకొచ్చింది.కోమలి సూసైడ్ నోట్ ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేస్తోంది..
తాజా వార్తలు
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక







