కువైట్‌ లో దంచికొడుతున్న ఎండలు..!!

- April 11, 2025 , by Maagulf
కువైట్‌ లో దంచికొడుతున్న ఎండలు..!!

కువైట్: కువైట్ లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయని వాతావరణ శాఖ డైరెక్టర్ ధరర్ అల్-అలీ తెలిపారు. వేడి గాలుల కారణంగా క్రమంగా ఉష్ణోగ్రతలు 41 -42 డిగ్రీల సెల్సియస్ మధ్య పెరుగుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో దుమ్ము కారణంగా హారిజంటల్ విజిబిలిటీ తగ్గుతుందని అల్-అలీ హెచ్చరించారు. మరోవైపు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం కూడా ఉందని, కొన్నిసార్లు ఉరుములతో కూడిన వర్షాలు కూడా పడవచ్చని తెలిపారు. సముద్ర తీర ప్రాంతాల్లో అలలు 6 అడుగులకు చేరే అవకాశం ఉందన్నారు.  తాజా వాతావరణ సమాచారం, హెచ్చరికల కోసం వాతావరణ శాఖ తన అధికారిక వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్,  సోషల్ మీడియా ఖాతాల ద్వారా అప్డేట్ లను తెలుసుకోవాలని సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com