వాహనాల పార్కింగ్ నిత్య నరకం
- July 07, 2016
ఇంటర్నేషనల్ మీడియా ప్రొడక్షన్ జోన్‌లో ఏర్పాటు చేసిన కొత్త బారియర్స్‌తో, పార్కింగ్ స్లాట్స్ దొరక్క వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్రీ శాండీ పార్కింగ్, రెసిడెంట్స్‌కి కొన్నేళ్ళుగా అందుబాటులో ఉంది. అయితే ఈ మధ్యకాలంలో వారికీ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. సరైన పార్కింగ్ ప్లేస్ కోసం 15 నుంచి 20 నిమిషాల డ్రైవ్ తప్పడంలేదని వాహణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారీ పార్కింగ్ కోసం నరకం చూడాల్సి వస్తుందని, ఇంతకు ముందు ఈ పరిస్థితి లేదని వాహనదారులు వాపోయారు. చాలా సందర్భాల్లో పార్కింగ్ స్పేస్‌ని అద్దెకు తీసుకోవాల్సి వచ్చినప్పుడు అధికంగా ధరల్ని భరించాల్సి ఉంటుందని వారు చెప్పారు. ఈ కారణంగా గొడవలు కూడా తలెత్తుతున్నాయన్నారు. ఏడాదికి పార్కింగ్ రెంట్ 6,000 దిర్హామ్‌లుగా నిర్ణయించారని, ఇది తాము భరించలేకపోతున్నామని అలెక్స్ అనే వాహనదారుడు చెప్పాడు. 500పైగా కార్లు బయటే నిలపాల్సి ఉంటోందనీ, వేసవి కాలంలో తమ కారు వద్దకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు వాహనదారులు. టెకామ్ డెవలపర్స్ ప్రతినిథులు మాట్లాడుతూ, దుబాయ్ మునిసిపాలిటీ హెచ్చరికల్ని తాము పరిగనణలోకి తీసుకోవాల్సి వచ్చిందనీ, అందుకే బారియర్స్‌ని ఏర్పాటు చేశామని అన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







