ఖతార్‌లో అంగరంగ వైభంగా ఈద్ ప్రార్ధనలు
- July 07, 2016
ఈదల్ అల్ ఫితర్ సందర్భంగా వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నివాసితులు అలాగే విజిటర్స్‌తో ఖతార్ అంతటా సందడి వాతావరణం నెలకొంది. సాంస్కృతిక అలాగే ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ దేశంలోని పలుచోట్ల నిర్వహించారు. వలసదారులు కూడా పలు కార్యక్రమాల్ని నిర్వహించారు. ఇండిస్ట్రియల్ ఏరియాలోని ఆసియన్ టౌన్‌లో వాక్రా క్లబ్ మరియు బార్వా వర్కర్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ - అల్ ఖోర్ ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు జరిగాయి. వందలాదిమంది ఆసియా టౌన్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఇండియా, శ్రీలంక, నేపాల్‌కి చెందిన పలువురు హాజరై, ఈద్ వేడుకల్ని ఎంజాయ్ చేశారు. శ్రీలంకకు చెందిన సభ్యులు పాటల్ని, డ్రామాలను, శ్రీలంక ఫోక్ డాన్సులను ప్రదర్శించారు. కొరియన్ కమ్యూనిటీ కొరియన్ డిజె మ్యూజిక్ షో నిర్వహించింది. నేపాలి కమ్యూనిటీ సాంగ్స్ మరియు గ్రూప్ డాన్సులు, ఫోక్ - ట్రెడిషనల్ డాన్సులతో అలరించింది. వాక్రా స్పోర్ట్స్ క్లబ్ ఇండోర్ ఫుట్‌బాల్ స్టేడియంలో బంగ్లాదేశీ కమ్యూనిటీ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఇస్లామిక్ సాంగ్స్‌తో హోరెత్తించారిక్కడ. లోకల్ మ్యూజిక్ గ్రూప్స్‌తో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారిక్కడ. ఈ సందర్భంగా సింగింగ్, డాన్స్ వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించి, బహుమతుల్ని నిర్వాహకులు అందజేశారు. గురువారంతో ఈ వేడుకలు ముగుస్తాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







