ఖతార్ లో పర్యావరణ ఉల్లంఘనలపై కఠిన చర్యలు..!!

- April 11, 2025 , by Maagulf
ఖతార్ లో పర్యావరణ ఉల్లంఘనలపై కఠిన చర్యలు..!!

దోహా: ఖతార్ పర్యావరణ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహారిస్తుంది. అల్ కరానాకు దక్షిణంగా ఉన్న “అల్-సబ్సెబ్” మేడో వద్ద పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అతను తన వాహనంతో గడ్డి మైదానంలోకి ప్రవేశించడం, గడ్డి మైదాన కంచెను ధ్వంసం చేయడం, పక్షులను ఆకర్షించే విజిల్ ఉపయోగించడం వంటి అనేక పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడ్డాడని పేర్కొంది. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతిఒక్కరి బాధ్యత అని పేర్కొంది.  పర్యావరణాన్ని పరిరక్షించడం కేవలం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాదని, భవిష్యత్ తరాలకు సహజ వనరులను అందించే నైతిక విధి అని వివరించింది. పౌరులు, నివాసితులు నిబంధనలను పాటించాలని, సంబంధిత అధికారులకు సహకరించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com