దుమ్ము తుఫాను..జీరోకు రోడ్ విజిబిలిటీ..!!
- April 11, 2025
కువైట్: గాలివాన, ఇసుక తుఫాను కారణంగా రహదారులపై విజిబిలిటీ దాదాపు జీరోకు పడిపయింది. దాంతో రోడ్డుపై వాహనాలు, ప్రజలు కనిపించక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హారిజంటల్ విజిబిలిటీ ఒక కి.మీ కంటే తక్కువకు వచ్చిందన్నారు. మరికొన్ని ప్రాంతాలలో దాదాపుగా సున్నాకి తగ్గిందని కువైట్ వాతావరణ శాఖ తెలిపింది. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. వాహనాల మధ్య సురక్షితమైన దూరం పాటించడం, మొబైల్ ఫోన్‌లను దూరంగా పెట్టడం, వాహనాల కిటికీలను మూసివేయడం ద్వారా దుమ్ము తుఫాన్ వచ్చిన సమయంలో క్షేమంగా తప్పించుకోవచ్చని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సహాయం కోసం అత్యవసర ఫోన్ నంబర్ 112 కు డయల్ చేయాలని కోరారు.
తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







