ఖతార్లో దుమ్ము తుఫాను..ప్రజలకు అడ్వైజ్ అలెర్ట్ జారీ..!!
- April 16, 2025
దోహా, ఖతార్: దుమ్ము తుఫాను దేశంపై ప్రభావం చూపుతున్నందున ప్రజలు ఆరోగ్య, భద్రతా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచించారు. ఈ మేరకు అడ్వైజ్ అలెర్ట్ జారీ చేశారు. సైనస్, శ్వాసకోశ సమస్యలు వంటి అలెర్జీలను కలిగించడంతోపాటు రహదారులపై లో విజిబిలిటీ సమస్య ఎదురయ్యే అవకాశంఉందని, ఇది రోడ్డు ప్రమాదాలను కలిగిస్తుందని పేర్కొన్నారు. ప్రజలు ఇంటి లోపలే ఉండాలని, బయట ఉన్నప్పుడు మొఖానికి అడ్డంగా క్లాత్ ధరించాలని ఆరోగ్య సంరక్షణ నిపుణులు సలహా ఇస్తున్నారు.
హమద్ మెడికల్ కార్పొరేషన్ అంబులెన్స్ సర్వీస్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలీ డార్విష్ మాట్లాడుతూ.. “ప్రజలు ఇంటి లోపలే ఉండాలని మేము సలహా ఇస్తున్నాము. ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులు శ్వాసకోశ లేదా ఇతర వైద్య పరిస్థితులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి.” అని పేర్కొన్నారు. దుమ్ము కణాలను పీల్చకుండా ఉండటానికి బయట ఫేస్ మాస్క్లు ధరించాలని కూడా ఆయన సిఫార్సు చేశారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు ఉన్న వ్యక్తులు వెంటనే అంబులెన్స్ సర్వీస్కు కాల్ చేయాలని, తేలికపాటి లక్షణాలను ఎదుర్కొంటున్న వారు సమీపంలోని ఆరోగ్య కేంద్రం, ఆసుపత్రి లేదా అత్యవసర విభాగాన్ని సందర్శించాలని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







