కొత్త పాలసీ..ఇకపై ఎమిరాటీలు మాత్రమే మీడియాతో మాట్లాడగలరు..!!

- April 17, 2025 , by Maagulf
కొత్త పాలసీ..ఇకపై ఎమిరాటీలు మాత్రమే మీడియాతో మాట్లాడగలరు..!!

యూఏఈః కొత్త విధానం ప్రకారం యూఏఈ పౌరులు మాత్రమే మీడియా ఛానెల్‌లలో ఎమిరాటీ మాండలికంలో మాట్లాడటానికి అనుమతి ఉందని ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ (FNC) స్పష్టం చేసింది. ఈ విధానం అమలులోకి వచ్చినప్పటి నుండి, సంబంధిత అధికారులు కొన్ని సంస్థలు చేసిన ఉల్లంఘనలను నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. కొన్ని మీడియా ప్రాతినిధ్యాలలో "ఎమిరాటీ మాండలికం,సాంస్కృతిక చిహ్నాల వక్రీకరణ" తర్వాత ఈ విధానాన్ని అమలు చేశారు. ఎమిరాటీలు యూఏఈకి చెందిన ప్రత్యేకమైన మాండలికంతో అరబిక్ మాట్లాడతారు. కొత్త విధానం ఎమిరాటీ సంస్కృతి, గుర్తింపు  ప్రామాణికతను కాపాడటం లక్ష్యంగా పెట్టుకుందని FNCలో జరిగిన చర్చ సందర్భంగా సభ్యురాలు నయీమా అల్ షర్హాన్ తెలిపారు. వేగవంతమైన సాంస్కృతిక మార్పులు, మీడియా ప్లాట్‌ఫారమ్‌ల విస్తరణ వల్ల ఎదురయ్యే సవాళ్లను ఈ సందర్భంగా హైలైట్ చేశారు. ఎమిరాటీ మాండలికం , స్థానిక సాంస్కృతిక చిహ్నాలు రోజువారీ మార్కెటింగ్,  వినోదంలో ప్రాముఖ్యతను సంతరించుకున్నప్పటికీ, వాటి ప్రదర్శనలో వక్రీకరణలు పెరుగుతున్నాయని ఆమె  ఆందోళన వ్యక్తం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com