షార్జాలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతన స్కేల్..!!
- April 18, 2025
యూఏఈ: షార్జా ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం కొత్త జీతం స్కేల్‌ను షార్జా పాలకుడు ఆమోదించారు. అలాగే ప్రతి ఉద్యోగ గ్రేడ్‌లో ప్రామాణిక నాలుగు సంవత్సరాల పదవీకాలంతో పాటు 'స్పెషల్ ఎ', 'స్పెషల్ బి' అనే రెండు కొత్త ఉద్యోగ గ్రేడ్లను కొత్తగా నమోదు చేయనున్నారు. కొత్త జీతం స్కేల్ ఉద్యోగ భద్రతను పెంచుతుందని, ప్రభుత్వ రంగంలోని ఎమిరాటీ పౌరులకు కెరీర్ పురోగతికి స్పష్టమైన మార్గాలను అందిస్తుందని భావిస్తున్నారు. షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ప్రభుత్వంలో పనిచేస్తున్న ఎమిరాటీ ఇంజనీర్ల కోసం ప్రత్యేకంగా సవరించిన జీతం స్కేల్‌ను కూడా ఆమోదించారు. ఇందులో కొత్త 'స్పెషల్' గ్రేడ్ పరిచయం చేశారు. జీతం స్కేల్ ఇంజనీరింగ్ స్థానాలకు ప్రతి ఉద్యోగ స్థాయిలో నాలుగు సంవత్సరాల వ్యవధిని కూడా నిర్దేశిస్తుంది.
షార్జాలోని మానవ వనరుల విభాగాధిపతి అబ్దుల్లా ఇబ్రహీం అల్ జాబి మాట్లాడుతూ.. "సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకున్న తర్వాత షార్జా ప్రభుత్వంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రొఫెషనల్ ఇంజనీర్లకు జీతాల స్కేళ్లకు సంబంధించి షార్జా పాలకుడి ఆదేశాలను అమలు చేయడం ప్రారంభిస్తాము. ఈ ఆదేశాలను అభినందిస్తూ షార్జా ప్రభుత్వ ఉద్యోగులు మరింత కృషి, అంకితభావంతో పనిచేయాలని మేము కోరుతున్నాము." అని అభిప్రాపడ్డారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







