సౌదీ అరేబియాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..!!
- April 18, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని చాలా ప్రాంతాలలో ఏప్రిల్ 21 వరకు ఒక మోస్తరు నుండి భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. వీటిలో జాజాన్, అసిర్, అల్-బహా, మక్కా, మదీనా, హైల్, ఖాసిమ్, రియాద్, తూర్పు ప్రావిన్స్, నజ్రాన్ ప్రాంతాలు ఉన్నాయి. వర్షంతో పాటు దుమ్ము తుఫాను, గంటకు 50 కి.మీ వేగంతో వస్తుందని, ఆకస్మిక వరదలు, వడగళ్ళు, తీరప్రాంతాల్లో అధిక అలలు, సుడిగాలులు లేదా జలప్రవాహాలు వచ్చే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. కేంద్రం వెబ్‌సైట్, సోషల్ మీడియా, అన్వా అప్లికేషన్ ద్వారా వాతావరణ పరిస్థితికి సంబంధించి హెచ్చరికలను అనుసరించాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







