సాదియత్ నుండి అబుదాబి విమానాశ్రయానికి ఉచిత డ్రైవర్‌లెస్ టాక్సీ సేవలు..!!
- April 18, 2025
యూఏఈ: అబుదాబిలోని ప్రయాణికులు ఇప్పుడు యాస్ ద్వీపంలోని సాదియత్ నుండి డ్రైవర్‌లెస్ టాక్సీలో జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సేవలను పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నారు. మొదటగా యాస్, సాదియత్ దీవులలో ప్రారంభమైన ఈ సేవ, ఇప్పుడు రాజధానిలోని కీలక ప్రదేశానికి చేరుకుంది.
"యాస్ ద్వీపం నుండి జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆటోమెటెడ్ వాహన సేవ విస్తరణ అబుదాబి మొబిలిటీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. అధునాతన సాంకేతికతలను రవాణా వ్యవస్థలో అనుసంధానించడంలో ఇది కీలకంగా మారుతుంది." అని అబుదాబిలోని ఆటోమెటెడ్ వాహన రవాణా సేవ విస్తరణ ఫాతిమా అల్ హంటౌబి అన్నారు.
2021 లో ప్రారంభించినప్పటి నుండి ఆటోమెటెడ్ వాహన సేలలు ఇప్పటివరకు 30వేల ట్రిప్పులను పూర్తి చేసిందని, 430,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించిందని వివరించారు. పైలట్ దశలో భాగంగా భద్రతా నిర్వాహకులు ఉంటారని ఫాతిమా అన్నారు. థాయ్ యాప్ ద్వారా ప్రయాణీకులు రైడ్లను బుక్ చేసుకోవచ్చు అని తెలిపారు. రాజధానిలో ఇప్పుడు దాదాపు 18 ఆటోమెటెడ్ టాక్సీలు పనిచేస్తున్నాయని, ఇవి యాస్ ద్వీపం, సాదియత్ ద్వీపం, ఇప్పుడు జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సేవలను విస్తరించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







