చికెన్ ఖాస్
- July 07, 2016కావలసినవి: ఒక కేజీ కోడి, 150 గ్రాముల వెన్న, పావుకేజీ ఉల్లిపాయలు, రెండు మూడు స్పూన్ల కారం, రెండు టేబుల్ స్పూన్ల టమోటా కెచప్, పావుకేజీ తాజా క్రీమ్, తగినంత ఉప్పు
ఎలా చేయాలి
చికెన్‌ను పెద్ద ముక్కలుగా కోసుకుని కడిగి పెట్టుకోండి. దానిలో రెండు కప్పుల నీళ్ళు, ఉప్పు వేసి ఉడికించండి. ఉడికాక మిగిలిన నీళ్ళను పక్కన తీసి పెట్టుకోండి. కడాయిని పొయ్యి మీద పెట్టి వెన్నవేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు మొత్తం వేసి వేగించండి. సగం పక్కన పెట్టి మిగతా సగంలో చికెన్, కారం, టమోటా కెచప్ వేయండి. బ్రౌన్ రంగు వచ్చేదాకా వేగించి మిగిలిన చికెన్ నీళ్ళలో క్రీం కలిపి దానిలో వేయండి. పక్కన పెట్టిన వేగించిన ఉల్లిపాయల్ని కూరమీద చల్లండి. దీన్ని నాన్లు, పరోటాలతో కలిపి తింటే బాగుంటుంది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..