రియాద్ మెట్రో ఆరెంజ్ లైన్‌..మరో రెండు కొత్త స్టేషన్లు ప్రారంభం..!!

- April 20, 2025 , by Maagulf
రియాద్ మెట్రో ఆరెంజ్ లైన్‌..మరో రెండు కొత్త స్టేషన్లు ప్రారంభం..!!

రియాద్: రియాద్ మెట్రో ఆరెంజ్ లైన్‌లో రెండు కొత్త స్టేషన్లను ప్రారంభిస్తున్నట్లు రియాద్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ప్రకటించింది. ది రైల్వే స్టేషన్, జరీర్ డిస్ట్రిక్ట్ స్టేషన్ అనే రెండు స్టేషన్లు ప్రారంభంతో రాజధాని నగరంలో ప్రజా రవాణా నెట్‌వర్క్ బలోపేతం అవుతుందని తెలిపింది.

ఆరెంజ్ లైన్ రియాద్ మెట్రో మూడవ లైన్. ఇది మదీనా రోడ్ నుండి ప్రిన్స్ సాద్ బిన్ అబ్దుల్‌రెహ్మాన్ I రోడ్ వరకు 40.7 కిలోమీటర్ల పొడవుతో ఉంది.

రియాద్ మెట్రో డిసెంబర్ 1, 2024న ప్రారంభించారు. 75 రోజుల్లోనే 18 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించింది.  162,000 ట్రిప్పులను పూర్తి చేసి 4.5 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించిందని రాయల్ కమిషన్ ఫర్ రియాద్ సిటీ (RCRC) ఫిబ్రవరిలో ప్రకటించింది.

రియాద్ మెట్రో మధ్యప్రాచ్యంలో అతిపెద్దది. ప్రపంచంలోనే అతి పొడవైన డ్రైవర్‌లెస్ రైలు వ్యవస్థగా గుర్తింపు పొందింది. 176 కిలోమీటర్ల పరిధిలో 85 స్టేషన్లతో సేవలు అందిస్తుంది. వీటిలో నాలుగు ప్రధాన హబ్‌లు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com