ఖతార్ లో పోటీ రక్షణ చట్టం బలోపేతం..ఉల్లంఘిస్తే మూసివేతే..!!
- April 21, 2025
దోహా: న్యాయమైన, పోటీతత్వ వ్యాపార వాతావరణం మార్గదర్శకాలను ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) వెల్లడించింది. పోటీ రక్షణ చట్టానికి కట్టుబడి ఉండాలని, మార్కెట్‌ను పరిమితం చేసే ఏవైనా పద్ధతులకు పాల్పడవద్దని హెచ్చరించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ తన X ప్లాట్ఫామ్లో ఒక పోస్ట్ పెట్టింది. “న్యాయమైన వ్యాపార వాతావరణాన్ని నిర్ధారించడానికి, పోటీకి హాని కలిగించే లేదా మార్కెట్ స్వేచ్ఛను పరిమితం చేసే పద్ధతులు నిషేధించబడ్డాయి. ఉల్లంఘనలకు పాల్పడితే ఆయా ఉత్పత్తిని నిలిపివేయడం; ధరల తారుమారు; ఉత్పత్తి, పంపిణీ లేదా మార్కెటింగ్ కార్యకలాపాలపై పరిమితులు విధించడం; ఏదైనా సంస్థ మార్కెట్లోకి ప్రవేశించకుండా లేదా నిష్క్రమించకుండా చట్టవిరుద్ధంగా నిరోధించడం వంటి చర్యలు తీసుకుంటారు.” అని వెల్లడిచింది.
పోటీదారులను ప్రభావితం చేయడానికి మార్కెట్లో ఆకస్మిక మిగులును సృష్టించడం; పోటీదారుల మధ్య మార్కెట్లను విభజించడం; మార్కెట్‌ను ప్రభావితం చేయడానికి టెండర్లు మరియు బిడ్లలో పోటీదారుల మధ్య అవగాహన వంటి కార్యాకలాపాలకు పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఇలాంటి చర్యలను నివేదించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







