సౌదీ అరేబియాలో సగటు ఆయుర్దాయం 78.8 సంవత్సరాలు..!!
- April 21, 2025
రియాద్: సౌదీ అరేబియాలో సగటు ఆయుర్దాయం 2024లో 78.8 సంవత్సరాలకు పెరిగింది. ఇది 2016లో 74 సంవత్సరాలుగా ఉంది. సౌదీ ఆరోగ్య రంగ పురోగతి కారణంగా ఇది సాధ్యమైందని అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఆహార ఉత్పత్తులలో హానికరమైన పదార్థాలను తగ్గించడం - హైడ్రోజనేటెడ్ నూనెలు, అధిక ఉప్పుతో సహా - అలాగే మధుమేహం, ఊబకాయం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ముందస్తు స్క్రీనింగ్‌ను చేపట్టడంతో మెరుగైన ఫలితాలు సాధించినట్లు తెలిపారు.
దీనితోపాటు సౌదీ అరేబియాలోని ఆరోగ్య అధికారులు ఆరోగ్య సంరక్షణ నిపుణులకు శిక్షణ ఇవ్వడం, రోగనిర్ధారణ మరియు చికిత్స సేవలను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా పౌరులు, నివాసితులు, సందర్శకులకు సేవల సామర్థ్యం, నాణ్యతను పెంచడానికి కృషి చేయడం జీవన నాణ్యతను గణనీయంగా మెరుగుపరిచిందని పేర్కొన్నారు. ఇదే రీతిలో పురోగతి సాధించడం ద్వారా 2030 నాటికి రాజ్యంలో ఆయుర్దాయం 80 సంవత్సరాలకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







