ఒమన్ లో ఎంప్లాయర్ సర్వే 2025 ప్రారంభం..!!
- April 21, 2025
మస్కట్:ఒమన్ లో ఎంప్లాయర్స్ సర్వే 2025 ను ఉన్నత విద్య, పరిశోధన, ఆవిష్కరణ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్.. జాతీయ కార్మిక మార్కెట్ లో ఉన్నత విద్య ఫలితాల అనుకూలతను అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తుందని, ముఖ్యంగా, ఈ ప్రాజెక్ట్ వివిధ ఆర్థిక రంగాలలో అవసరమైన నైపుణ్యాలు, సామర్థ్యాలను గుర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ 2018 - 2025 మధ్య ఉన్నత విద్య గ్రాడ్యుయేట్లను నియమించిన వివిధ సంస్థల నుండి సంవత్సరంలో మొదటి ఆరు నెలల (జూన్ 30 వరకు) డేటాను సేకరించనున్నారు.
ఉన్నత విద్య, పరిశోధన, ఆవిష్కరణల మంత్రి డాక్టర్ రహమా ఇబ్రహీం అల్ మహ్రౌకి ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. ఒమన్ విజన్ 2040 లక్ష్యాలకు అనుగుణంగా విద్యా విధానాలను రూపొందించడంలో. వాటిని కార్మిక మార్కెట్ అవసరాలకు అనుసంధానించడంలో ఇది కీలకంగా నిలుస్తుందని అన్నారు. ఇది జాతీయ ఆర్థిక వ్యవస్థ పోటీతత్వాన్ని పెంచడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







