కస్టమర్లకు 'ఎర్రర్' SMS.. క్షమాపణలు చెప్పిన యూఏఈ బ్యాంక్..!!

- April 21, 2025 , by Maagulf
కస్టమర్లకు \'ఎర్రర్\' SMS.. క్షమాపణలు చెప్పిన యూఏఈ బ్యాంక్..!!

యూఏఈ: కొంతమంది కస్టమర్లకు 'మోసపూరితంగా' అనిపించిన 'ఎర్రర్' మెసేజులు రావడంతో ఆదివారం యూఏఈ బ్యాంక్ వారికి క్షమాపణలు చెప్పింది.సోషల్ మీడియా ద్వారా పలువురు బ్యాంక్ కస్టమర్లు మెసేజులు వచ్చిన తెలిపారు.ఇవన్నీ ఫ్రాడ్ లా అనిపించాయని ఫిర్యాదులు చేశారు. తాము బ్యాంకుకు కాల్ చేసినా.. దాదాపు గంటసేపు ఎటువంటి స్పందన రాలేదని పలువురు కస్టమర్లు అసహనంవ్యక్తం చేశారు.

"మీ పెద్ద బ్యాంకు కాల్స్‌కు హాజరు కాగల కస్టమర్ కేర్ ఏజెంట్లు లేరు.  45 నుండి 60 నిమిషాల తర్వాత ఎవరో ఒకరు కాల్‌కు హాజరై, అది సాంకేతిక లోపం అని చెప్పి క్షమాపణలు చెప్పారు" అని వినియోగదారులు ఆన్‌లైన్‌లో రాసుకొచ్చారు. బ్యాంకు సోషల్ మీడియా అకౌంట్ లోఇలాంటి లావాదేవీల భయాల గురించి ఫిర్యాదు చేసే కస్టమర్ల కమెంట్లతో నిండిపోయింది.    

'RA DISB MIGRATION' అనే పేరుతో వచ్చిన SMS దాని సిస్టమ్ అప్‌గ్రేడ్ సమయంలో ఒక లోపం అని బ్యాంక్ స్పష్టం చేసింది. "మీరు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.ఈరోజు మీకు వచ్చిన 'RA DISB MIGRATION' అనే SMS కి సంబంధించినది అయితే, దయచేసి ENBD నుండి వచ్చిన సందేశాన్ని విస్మరించండి. మా సిస్టమ్ అప్‌గ్రేడ్ సమయంలో అది పొరపాటున పంపబడింది." అని బ్యాంకు క్షమాపణలు చెప్పింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com