ఒమన్‌లో రక్తదానం కోసం అత్యవసర విజ్ఞప్తి..!!

- April 23, 2025 , by Maagulf
ఒమన్‌లో రక్తదానం కోసం అత్యవసర విజ్ఞప్తి..!!

మస్కట్: AB (+ve) రక్త రకం కోసం అత్యవసరంగా పిలుపునిచ్చారు. తీవ్రమైన రక్తస్రావంతో బాధపడుతున్న అత్యవసర వైద్య కేసు కారణంగా బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేయాలని బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ విభాగం (DBBS) అత్యవసర విజ్ఞప్తి చేసింది. తీవ్రమైన రక్తస్రావంతో బాధపడుతున్న అత్యవసర వైద్య కేసు ఉందని, అత్యవసరంగా పెద్ద మొత్తంలో AB+ రక్తం అవసరమని DBBS ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రక్త రకం ఉన్నవారు బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌లో వీలైనంత త్వరగా రక్తదానం, ప్లేట్‌లెట్లను డొనెట్ చేయాలని కోరారు.

బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేసే సమయాలు..  శనివారం నుండి గురువారం వరకు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు , శుక్రవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com