టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన డేవిడ్ వార్నర్
- April 23, 2025
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ చరిత్ర సృష్టించాడు.విరాట్ కోహ్లీ క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్ వంటి దిగ్గజాల జాబితాలో డేవిడ్ వార్నర్ చేరాడు. పాకిస్థాన్‌లో జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో డేవిడ్ వార్నర్ అంతా గొప్పగా ఏమీ ప్రారంభించలేదు. కానీ సోమవారం డేవిడ్ వార్నర్ పెషావర్ జల్మీపై అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ లో డేవిడ్ వార్నర్ కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.పెషావర్ జల్మీతో జరిగిన తక్కువ స్కోరు మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ తన జట్టును విజయపథంలో నడిపించాడు. సోమవారం నేషనల్ స్టేడియంలో కష్టతరమైన పిచ్‌పై పవర్ ప్లేలో కరాచీ కింగ్స్ మూడు వికెట్లు త్వరగా కోల్పోయిన తర్వాత డేవిడ్ వార్నర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. డేవిడ్ వార్నర్ 47 బంతుల్లో 8 ఫోర్లతో 60 పరుగులు చేశాడు. 148 పరుగుల లక్ష్యాన్ని కరాచీ కింగ్స్ మూడు బంతులు, రెండు వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించింది.
ఆరో బ్యాటర్
తన ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ టీ20 క్రికెట్‌లో 13 వేల పరుగులు పూర్తి చేసిన ఘనతను కూడా సాధించాడు. చరిత్రలో అలా చేసిన ఆరో బ్యాటర్‌గా డేవిడ్ వార్నర్ నిలిచాడు. డేవిడ్ వార్నర్ తన 403వ ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను సాధించాడు. క్రిస్ గేల్(381 ఇన్నింగ్స్), విరాట్ కోహ్లీ(386 ఇన్నింగ్స్) తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న మూడో అత్యంత వేగవంతమైన బ్యాటర్ గా డేవిడ్ వార్నర్ నిలిచాడు.టీ20 క్రికెట్ లో 13000 పరుగులు చేసిన ఆరుగురు ఆటగాళ్లలో షోయబ్ మాలిక్ కూడా ఒకరు. అయితే షోయబ్ మాలిక్ 13 వేల పరుగులు పూర్తి చేయడానికి 487 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. కానీ డేవిడ్ వార్నర్ ఈ ఘనతను 84 ఇన్నింగ్స్ కంటే ముందే సాధించాడు. అంటే 403 మ్యాచ్ లలోనే ఈ ఘనతను సాధించగలిగాడు.
క్రిస్ గేల్,విరాట్ కోహ్లీ,డేవిడ్ వార్నర్,అలెక్స్ హేల్స్,షోయబ్ మాలిక్,కీరాన్ పొలార్డ్. డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని కరాచీ కింగ్స్ పెషావర్ జల్మీని ఓడించి పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో కరాచీ 3 విజయాలు సాధించింది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!