చేనేత, హస్తకళల అభివృద్ధికి సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన సుచిత్ర ఎల్ల
- April 23, 2025
విజయవాడ: పద్మభూషణ్ అవార్డు గ్రహీత, భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు సుచిత్ర ఎల్ల చేనేత, హస్తకళల అభివృద్ధికి సలహాదారుగా శుక్రవారం విజయవాడలోని ఆప్కో భవన్లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుచిత్రా ను రెండు సంవత్సరాల కాలపరిమితితో క్యాబినెట్ హోదా లో నియమించింది. ఈ పదవిలో ఆమె రాష్ట్రంలోని చేనేత, హస్తకళా రంగాల బలోపేతానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వం అందించనున్నారు. పాలసీ మార్పులపై సలహా, సుస్థిర అభివృద్ధి, మార్కెట్ ప్రాప్యత పెంపు, డిజిటల్ వేదికలు, జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపుల ప్రోత్సాహం వంటి అంశాలపై ఆమె దృష్టి కేంద్రీకరిస్తారు. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ కమిషనర్ రెఖా రాణి పాల్గొని, సుచిత్ర ఎల్లకు శాఖ పురోగతి గురించి వివరించారు. పారిశ్రామికత రంగం లో ఆమెకు ఉన్న అనుభవం, నాయకత్వం చేనేత రంగానికి మంచి ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రంగాల వారీగా లక్ష్యబద్ధమైన అభివృద్ధికి నిపుణులను సలహాదారులుగా నియమించేందుకు చేపట్టిన విస్తృత ప్రణాళికలో భాగంగా సుచిత్ర ఎల్ల నియామకం జరిగింది. కార్యక్రమంలో ఆప్కో అధికారులు నాగేశ్వర రావు, కన్న బాబు, రాజా రావు తదితరులు పాల్గొన్నారు
తాజా వార్తలు
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!







