జియోస్పేషియల్ రంగంలో సౌదీ అరేబియాకు టాప్ ప్లేస్..!!
- April 23, 2025
మాడ్రిడ్: జనరల్ అథారిటీ ఫర్ సర్వే అండ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ (GEOSA) రంగంలో సౌదీ అరేబియా.. 2022లో జియోస్పేషియల్ నాలెడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (GKI) రెడీనెస్ ఇండెక్స్‌లో32వ స్థానంలో ఉన్నసౌదీ ప్రపంచవ్యాప్తంగా 9వ స్థానానికి చేరుకోవడం ద్వారా తన జియోస్పేషియల్ నాలెడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను గణనీయంగా పెంచుకుంది. సౌదీ అరేబియా మధ్యప్రాచ్యం, అరబ్ ప్రపంచంలో మొదటి స్థానంలో, G20 దేశాలలో 6వ స్థానంలో నిలిచింది. మంగళవారం స్పానిష్ రాజధాని మాడ్రిడ్‌లో ప్రారంభమై జియోస్పేషియల్ వరల్డ్ ఫోరం 2025 మొదటి రోజు ఈ మేరకు ప్రకటించారు.
GEOSA విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. జియోస్పేషియల్ వరల్డ్ అభివృద్ధి చేసిన GKI రెడీనెస్ ఇండెక్స్, జియోస్పేషియల్ నాలెడ్జ్ షేరింగ్, ఆర్థిక వృద్ధి, స్థిరమైన అభివృద్ధి, డిజిటల్ విభాగంలో మెరుగైన స్థానాన్ని పొందినట్లు తెలిపింది. జాతీయ జియోస్పేషియల్ డేటా వ్యవస్థ పాలనలో.. అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా విధానాలు, ప్రమాణాలు, స్పెసిఫికేషన్ల తయారీలో సౌదీ అరేబియా విధాన పరంగా ప్రపంచవ్యాప్తంగా ఆరవ స్థానంలో నిలిచింది. జియోస్పేషియల్ రంగంలో చేసిన అభివృద్ధి, ప్రపంచ దేశాలలో ప్రముఖ స్థానాన్ని పొందేలా చేసిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!
- అమెరికాలో మొదటి యుద్ధ నౌకను ఆవిష్కరించిన సౌదీ..!!
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం







