29వ మస్కట్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!

- April 24, 2025 , by Maagulf
29వ మస్కట్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!

మస్కట్: 29వ మస్కట్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో సుల్తాన్ కబూస్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ హెచ్.హెచ్. సయ్యద్ డాక్టర్ ఫహద్ బిన్ అల్ జులాండా అల్ సైద్ ఆధ్వర్యంలో ప్రారంభం అయింది.  ఈ కార్యక్రమంలో యూఏఈ సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు హిస్ హైనెస్ షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి, సమాచార మంత్రి,  ప్రధాన నిర్వాహక కమిటీ ఛైర్మన్ హిస్ ఎక్సలెన్సీ డాక్టర్ అబ్దుల్లా బిన్ నాసర్ అల్ హరాసి పాల్గొన్నారు.

ఈ సంవత్సరం, ఈ ప్రదర్శనలో 35 దేశాల నుండి 674 ప్రచురణ సంస్థలు పాల్గొంటున్నాయి. 640 సంస్థలు ప్రత్యక్షంగా 34 ఏజెన్సీల ద్వారా పాల్గొంటాయి. ఈ ఫెయిర్ ప్లాట్‌ఫామ్‌లో జాబితా చేయబడిన మొత్తం టైటిల్స్, ప్రచురణల సంఖ్య 681,041కి చేరుకుంది. వాటిలో 467,413 అరబిక్ పుస్తకాలు, 213,610 విదేశీ పుస్తకాలు ఉన్నాయి. వీటితోపాటు 27,464 ఒమానీ ప్రచురణలు ప్రదర్శనకు పెట్టారు. 

నార్త్ అల్ షార్కియా గవర్నరేట్ ఈ ఎడిషన్‌కు గౌరవ అతిథి హోదాలో పాల్గొంటుంది. ఈ ప్రాంతం సాంస్కృతిక వారసత్వం, చారిత్రక వ్యక్తులు, శాస్త్రీయ సహకారాలు, పర్యాటక ఆకర్షణలు, ఆధునిక జీవనశైలిని హైలైట్ చేసే ప్రచురణలతో ప్రత్యేక పెవిలియన్‌ను ఏర్పాటు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com