అబుదాబిలో అపార్ట్‌మెంట్ నుండి పడి యువకుడు మృతి..!!
- April 26, 2025
యూఏఈ: అబుదాబిలో విషాదం చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం తాను నివసించిన భవనం నుండి పడి 17 ఏళ్ల విద్యార్థి మరణించాడు. అబుదాబి ఇండియన్ స్కూల్‌లో చదువుతున్న అలెక్స్ బినోయ్ తనుంటున్న భవనం మూడవ అంతస్తు అపార్ట్‌మెంట్ నుండి పడిపోయాడని అబుదాబికి చెందిన భారతీయ సామాజిక కార్యకర్త వెల్లడించారు. అయితే, భవనం వాచ్‌మెన్ అప్రమత్తం చేసే వరకు తమ కుమారుడు పడిపోయాడన్న సంగతే తెలియదని బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ముగ్గురు పిల్లలలో చిన్నవాడు అలెక్స్. తను గ్రేడ్ 12 CBSE బోర్డు పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. అతని తల్లిదండ్రులు, బినోయ్ థామస్, ఎల్సీ బినోయ్ యూఏఈలో చాలా కాలంగా నివసిస్తున్నారు. ఎల్సీ అబుదాబిలోని ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు.
యువకుడి మృతదేహాన్ని శనివారం సాయంత్రం అతని స్వస్థలమైన కేరళకు తీసుకువెళతామని, అక్కడ అతన్ని ఖననం చేస్తామని ఆయన అన్నారు. బాలుడికి ఇద్దరు అన్నలు ఉన్నారు. భారతదేశంలో నివసిస్తున్న డాక్టర్ రాహుల్ బినోయ్ ఒకరు కాగా, మరోకరు పోలాండ్‌లో పనిచేస్తున్న రోహిత్ బినోయ్. అతని మృతదేహాన్ని ఏప్రిల్ 26, శనివారం రాత్రి 10.40 గంటలకు ఇండియాకు తీసుకెళ్లనున్నారు.
దర్శకుడు కావాలనే ఆకాంక్షతో అలెక్స్ షార్ట్ ఫిల్మ్‌లు, రీల్స్ తీయడానికి ఇష్టపడేవాడని; మాస్ కమ్యూనికేషన్ అధ్యయనం చేయడానికి బెంగళూరులోని ఒక విశ్వవిద్యాలయంలో ఇప్పటికే అతనికి ప్రవేశం లభించిందని బినోయ్ థామస్ తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







