అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- March 03, 2026
మస్కట్: ప్రాంతీయ గగనతల మూసివేతల కారణంగా అనేక విమానాలను రద్దు చేసినట్లు ఒమన్ ఎయిర్ ప్రకటించింది. రద్దు చేసిన ఫ్లైట్స్ మార్చి 4, 5 మరియు 6 వ తేదీల్లో షెడ్యూల్ చేయబడ్డాయని ప్రకటించిది.
అమ్మాన్ (AMM), దుబాయ్ (DXB), బహ్రెయిన్ (BAH), దోహా (DOH), దమ్మామ్ (DMM), కువైట్ (KWI), కోపెన్‌హాగన్ (CPH), బాగ్దాద్ (BGW), మరియు ఖసాబ్ (KHS) లకు మరియు బయలుదేరే అన్ని విమానాలు ప్రభావితం అయినట్టు తెలిపింది.
మిగిలిన అన్ని విమానాలు ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయని, అయితే కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉందని తెలిపింది. తాజా పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు . ఒమన్ ఎయిర్ పేర్కొంది. తన అధికారిక ఛానెల్‌లు మరియు వెబ్‌సైట్ ద్వారా అప్డేట్ లను పంచుకుంటామని తెలిపింది. తమ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుకింగ్‌లను నిర్వహించుకోవాలని ఎయిర్‌లైన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక







