ఇరాన్ పోర్టులో భారీ పేలుడు.. 400 మందికి పైగా గాయాలు
- April 26, 2025
ఇరాన్: భారీ పేలుడు ఇరాన్ తీరప్రాంత నగరాన్ని కుదిపేసింది. ఇరాన్ తీరప్రాంత నగరం బందర్ అబ్బాస్ సమీపంలోని షాహిద్ రజాయి నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మంటలు చెలరేగి 406 మంది గాయపడ్డారు. కాగా, ఈ పేలుడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోర్టులో పెద్ద సంఖ్యలో ఒకేచోట కంటైనర్లు నిల్వ ఉంచారు. అక్కడే పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.
పేలుడు తర్వాత దట్టమైన పొగలు వెలువడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పేలుడు తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. ఘటనా స్థలం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న భవనాల అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. ఇళ్ల గోడలకు పగుళ్లు వచ్చాయి. పేలుడు ధాటికి ఓ భవనం కూలిపోయినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక కంగారుపడ్డారు.
రజాయి పోర్టులో ప్రధానంగా కంటైనర్ల కార్యకలాపాలు జరుగుతాయి. ఏటా 80 మిలియన్ టన్నుల సరకు ఎగుమతి, దిగుమతి అవుతుంది. స్థానికంగా చమురు ట్యాంకులు, పెట్రోకెమికల్ సౌకర్యాలు ఉన్నాయి. ఒమన్‌లో ఇరాన్, అమెరికా మధ్య మూడవ రౌండ్ అణు చర్చలు ప్రారంభమైన సమయంలోనే ఈ పేలుడు సంభవించడం కలకలం రేపింది.
ది జెరూసలేం పోస్ట్ ప్రకారం, ఈ పేలుడు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నావికా స్థావరం సమీపంలో సంభవించింది. ఈ పేలుడులో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రకటించింది.
పేలుడు తర్వాత నల్లటి పొగ కమ్ముకున్న దృశ్యాల వీడియోలు భయాందోళనకు గురి చేశాయి. “షాహిద్ రజాయి పోర్ట్ వార్ఫ్‌లో నిల్వ చేసిన అనేక కంటైనర్లు పేలిపోయాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం” అని స్థానిక అధికారులు తెలిపారు.
షాహిద్ రజాయి నౌకాశ్రయంలో చోటు చేసుకున్న పేలుడు, అగ్ని ప్రమాదం తమ చమురు సౌకర్యాలపై ఎటువంటి ప్రభావం చూపలేదని నేషనల్ ఇరానియన్ పెట్రోలియం రిఫైనింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (NIPRDC) స్పష్టం చేసింది. “షాహిద్ రజాయి పోర్టులో జరిగిన పేలుడు, అగ్నిప్రమాదానికి ఈ కంపెనీకి సంబంధించిన శుద్ధి కర్మాగారాలు, ఇంధన ట్యాంకులు, పంపిణీ సముదాయాలు, చమురు పైపులైన్లకు ఎటువంటి సంబంధం లేదు” అని NIPRDC ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
భారీ పేలుడు ఇరాన్ తీరప్రాంత నగరాన్ని కుదిపేసింది. ఇరాన్ తీరప్రాంత నగరం బందర్ అబ్బాస్ సమీపంలోని షాహిద్ రజాయి నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మంటలు చెలరేగి 406 మంది గాయపడ్డారు. కాగా, ఈ పేలుడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోర్టులో పెద్ద సంఖ్యలో ఒకేచోట కంటైనర్లు నిల్వ ఉంచారు. అక్కడే పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.
పేలుడు తర్వాత దట్టమైన పొగలు వెలువడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పేలుడు తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. ఘటనా స్థలం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న భవనాల అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. ఇళ్ల గోడలకు పగుళ్లు వచ్చాయి.పేలుడు ధాటికి ఓ భవనం కూలిపోయినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక కంగారుపడ్డారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







