యు.ఏ.ఈ మహిళను 'ఉరి' తీసారు
- July 12, 2015
ఉగ్రవాద చర్యలకు పాల్పడిందనే కారణంతో గల్ఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యు.ఏ.ఈ) తమ దేశానికి చెందిన ఓ మహిళను ఉరితీసింది. 2014 డిసెంబర్లో అమెరికాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలిని హతమార్చిన నేపథ్యంలో ఆమెకు సోమవారం ఉదయం ఉరిశిక్షను అమలు పరిచింది. అలా బాదర్ అబ్దుల్లా అల్ హషిమి(31) అనే మహిళ గత ఏడాది అబుదాబిలోని ఓ షాపింగ్ మాల్ టాయిలెట్ లో ఇద్దరి కవలల తల్లి అయిన అమెరికన్ టీచర్ ఇబోల్యా ర్యాన్ ను కత్తితో పొడవడమే కాకుండా అక్కడే మరో అమెరికన్ ఈజిప్టు వైద్యుడిపై బాంబుదాడికి పాల్పడింది. అంతేకాదు ఆమెపై ఇంటర్నెట్ ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని తీవ్రస్థాయిలో వ్యాపింపజేసిన ఆరోపణలున్నాయి. ఈ నేరాలకు సంబంధించి ఆమెకు గత ఏడాది యూఏఈ కోర్టు ఉరిశిక్ష విధించగా సోమవారం అమలుచేసింది. అయితే, ఎలా ఉరితీశారనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఉగ్రవాద చర్యలను తీవ్రంగా నిరసించే దేశాల్లో యు.ఏ.ఈ ఎప్పుడూ ముందే ఉంటుంది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







