కొలెస్ట్రాల్ ను తగ్గించడం ఎలా?
- July 12, 2015
ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో 80శాతం మంది గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తున్నారు. అందుకు ముఖ్య కారణం అధిక కొలెస్ట్రాల్ !ఎప్పుడైతే మీరు అధిక కొలెస్ట్రాల్ కు గురికాకుండా ఉంటారు అప్పుడు సాధారణంగా ఉంటారు . లో డెన్సిటి లిప్పోప్రోటీన్ లేదా ఎల్ డి ఎల్ టైప్ బ్యాడ్ కొలెస్ట్రాల్ నిధానంగా మరియు క్రమంగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి, కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ఫుడ్స్ ఉన్నాయి. ఇవి మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడానికి సహాయపడుతాయి. ఈ క్రింది స్లైడ్ లో తెలిపిన పవర్ ఫుల్ ఆహారాలు రక్తకణాల్లోని ఎల్ డిఎల్ వెవల్స్ రక్తకణాల యొక్క గోడల్లో కొలెస్ట్రాల్ (ఎల్ డిఎల్)ఏర్పడకుండా.. తగ్గించడానికి సహాయపడుతాయి . కాబట్టి మీరు ఇది కనుక నివారించినట్లైతే మీరు రక్తనాణాల్లో బ్లాకేజ్ లు ఉండవు . దాంతో హార్ట్ అటాక్ ప్రమాధం ఉండదు.కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 బెస్ట్ ఫుడ్స్! ఈ సింపుల్ హోం రెమెడీస్ ప్రతి రోజూ ఫాలో అయినట్లైతే కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. మరి ఆ ఆహారాలేంటో చూద్దామా. సిట్రస్ పండ్లు: నిమ్మజాతికి చెందిన పండ్లన్నీ గుండెకు మేలు చేసేవే. బాగా పండిన నారింజలో విటమిన్ -ఏ, బి6, సి పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు ఫోలేట్ పొటాషియమ్, ఫైబర్ ఎక్కువ. పొటాషియమ్ వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండెకు రక్షణ కలుగుతుంది. వీటిలో పదార్ధాలలో కొవ్వు స్థాయి చాలా చాలా తక్కువ. ఈ ఆహారంలో సహజంగా మినరల్స్, విటమిన్లు ఉంటాయి. కాబట్టి నార్మల్ లెవల్స్ ను మెయింటైన్ చేస్తుంది. కాబట్టి నేచురల్ ఆరెంజ్ జ్యూస్ ను తీసుకోవాలి. రెడ్ వైన్ గుండెకు మేలు చేస్తాయని అనేక పరిశోధనలు నిరూపించాయి. రెడ్ వైన్ లో 70శాతం పైగా కోకో కేట్ ఛిన్స్ అనే పదార్థం శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. కనుక రెడ్ వైన్ గుండెకు చాలా మంచి పానీయం. మితంగా తీసుకోవచ్చు. తృణధాన్యాలల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బి కాంప్లెక్స్ అధికం. కాలేయ పనితీరు సామార్థాన్ని ప్రోత్సహించేందుకు బాగా సహాయపడుతుంది. బ్రౌన్ రైస్ మల్టీ గ్రెన్ పిండి మరియు సోయా పిండి ఆరోగ్యానికి చాలా మంచిది అందువలన వీటిని వాడటం వల్ల కాలేయ సమస్యలను దూరంగా ఉంచవచ్చు. హై కొలెస్ట్రాల్ లెవల్స్ ఉన్నవారికి క్వీనా, రాగి, మిల్లెట్ వంటి ధాన్యాలు హై కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించడానికి బాగా సహాపడుతాయి. చాలామందికి కాయగూరలే ఆరోగ్యానికి మంచిదని తెలిసినప్పటికీ వాటిని ఇష్టంగా తినరు. అటువంటి వారే కూరల్లో కొద్ది ఆలివ్ ఆయిల్ వేసుకుంటే వాటి ఫ్లేవరే కాదు రుచి కూడా పెరుగుతుంది. అంతేకాదు, పొట్ట తగ్గేందుకు దోహదం చేసే గుణాలు ఇందులో ఉన్నాయి. వంట నూనెల్లో రారాజు ఆలివ్ ఆయిల్. సన్ ఫ్లవర్, గ్రౌండ్ నట్ ఆయిల్స్ తో పోల్చుకుంటే దీని ఖరీదు ఎక్కువ. అయినా అన్ని నూనెలకంటే ఇందులోనే తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్ లోని యాంటీ ఆక్సిడెంట్స్ హృద్రోగులకు ఎంతో మేలు చేస్తాయి. ఓట్ మీల్, ఓట్ బ్రాన్లో ఆహార సంబంధ పీచు గణనీయంగా ఉంటుంది. ... 43 గ్రాముల ఓట్ మీల్ తీసుకోవడం వల్ల రెండు నెలల తర్వాత మొత్తం కొలెస్ట్రాల్లో 3 శాతం కొలెస్ట్రాల్ కోల్పోవడం, చెడు కొలెస్ట్రాల్లో 14 శాతం తగ్గిందని చాలా పరిశోధనలు చెప్పాయి. శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ ను చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది . ఓట్స్ లో సోలబుల్ ఫైబర్, బీటా గ్లూకాన్ అధికంగా ఉండటం వల్ల ఇది ఎల్ డిఎల్ లెవల్స్ ను చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తాయి. మధురమైన రుచిని మాత్రమే కాదు, ఒబేసిటీని తగ్గించి, తక్కువ సమయంలోనే ఎక్కువ శక్తిని అందిస్తుంది తేనె. రోజూ ఉదయం పూట వేడి నీళ్లలో పది చుక్కల తేనె కలుపుకొని తాగితే చురుగ్గా ఉంటారు. అంతే కాదు నేచురల్ హనీలో కొలెస్ట్రాల్ తగ్గించే కాంపోనెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఇది హోమో సెస్టైన్ అటాక్ ను, అమినో యాసిడ్స్ ను పొరిఫెరల్ వ్యాస్కులర్ వ్యాధులను మరియు హార్ట్ డిసీజ్ లను తగ్గిస్తుంది. ఇది మరింత బెటర్ హెల్తీ లైఫ్ ను పొందేలా చేస్తుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







