'రాజమౌళి'ని ప్రశంసలతో ముంచిన 'వర్మ'
- July 13, 2015
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాను దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆకాశానికెత్తేశారు. ఇక ఏ సినిమా అయిన దీని తర్వాతే అని వ్యాఖ్యానించారు. హీరో కంటే కథే గొప్ప అని ఈ చిత్రం రుజువు చేసిందని, ఈ విషయాన్ని హాలీవుడ్ దశాబ్దాల క్రితమే గుర్తించిందని పేర్కొన్నారు. తామే గొప్పవాళ్లమని విర్రవీగుతున్న హీరోలకు 'బాహుబలి' మేలుకొలుపు అన్నారు. సింహాలు, పులులు, ఏనుగులు, కొండచిలువలతో నిండివున్న ఇండస్ట్రీ జంగిల్ లోకి బాహుబలి డైనోసార్ వచ్చిందని... అంతకుముందున్న పాలన మారుతుందని వ్యాఖ్యానించారు. ప్రభాస్ టెరిఫిక్ గా చేశాడని ప్రశంసించారు. దగ్గుబాటి రానా అయితే ఫిజికల్ గా, పెఫ్మార్ మెన్స్ పరంగా శిఖర స్థాయిని అందుకున్నాడని ఆకాశానికెత్తారు. రమ్యకృష్ణ చాలా బాగా చేసిందని మెచ్చుకున్నారు. 'బాహుబలి' తర్వాత వచ్చే పెద్ద హీరోల సినిమా 5డీలో చూడాల్సివుంటుందన్నారు. రాజమౌళి ఇక్కడకు పుట్టినందుకు తెలుగువారు గర్వపడక్కర్లేదని.. బాంబే లేదా లాస్ ఏంజెలెస్ లో పుట్టకపోవడం అతడి దురదృష్టమని ట్విటర్ లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







