6 లేన్లుగా హైదరాబాద్-విజయవాడ హైవే..
- April 29, 2025
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని విస్తరించేందుకు డీపీఆర్‌ను మే నెల చివరి నాటికి పూర్తిచేయించాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ యోచిస్తోంది. ఎన్‌హెచ్-65ను 6 లేన్లుగా విస్తరించాలని కేంద్ర సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఇందుకుగానూ కిలోమీటరుకు దాదాపు రూ.20 కోట్ల చొప్పున అవుతుందని అధికారుల అంచనా. ఎన్‌హెచ్-65ను దండు మల్కాపూర్ నుంచి ఏపీలోని గొల్లపూడి వరకు ఆరు లేన్లుగా విస్తరిస్తారు. దీంతో 265 కిలోమీటర్లకు మొత్తం రూ.5,300 కోట్లు అవుతాయి.
జూన్ తొలి వారంలో ఇందుకు సంబంధించిన పనులకు అనుమతులను తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. డీపీఆర్ రూపొందించే వర్క్‌ను భోపాల్‌కు చెందిన సంస్థ ఇప్పటికే దక్కించుకుంది. ఆ సంస్థతో పాటు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు ఈ విస్తరణ పనుల ప్రక్రియపై సమీక్ష సమావేశాలు జరుపుతున్నారు.
ఇప్పటికే 6 లేన్లకుగాను భూమిని సేకరించారు. జాతీయ రహదారి విస్తరణకు టెక్నికల్‌గా పలు అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని విస్తరణలో భాగంగా మార్గమధ్యంలో పలు ప్రాంతాల్లో వెహికల్ అండర్ పాస్‌లు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, బ్రిడ్జిలు నిర్మిస్తారు. రామాపురం క్రాస్ రోడ్డు వద్ద వీయూపీ నిర్మించనున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







