కేరళలో 16 మంది ముస్లిం యువకుల అదృశ్యం
- July 08, 2016
కేరళలోని కాసర్ గొడ్ జిల్లాకు చెందిన 16 మంది ముస్లిం యువకులు కనిపించకుండా పోవడంతో కలకలం రేగింది. గత నెల రోజుల నుంచి కనిపించకుండాపోయిన వీరు సిరియా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్)లో చేరేందుకు వెళ్లినట్టు అనుమానిస్తున్నారు.తీర్థయాత్రకు దేశం విడిచి వెళ్లారని, తర్వాత వారి ఫోన్లు పనిచేయడం లేదని కనిపించకుండా పోయిన వారి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే తమ గమ్యస్థానానికి చేరుకున్నామని తనకు వాట్సాప్ లో మెసేజ్ వచ్చిందని మరొకరు వెల్లడించారు. మాయమైన ముస్లిం యువకులు సిరియా లేదా ఇరాక్ లోని అంతర్యుద్ధ ప్రాంతాలకు చేరుకునివుంటారని అనుమానిస్తున్నట్టు చెప్పారు.అదృశ్యమైన వారిలో భార్య, ఎనిమిది నెలల బిడ్డ ఉన్న డాక్టర్ ఉన్నాడు. వీరంతా త్రిక్కరిపూర్, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారని కాసర్ గొడ్ ఎంపీపీ కరుణాకరణ్ తెలిపారు. తీర్థయాత్రకు వెళ్లిన వీరంతా తిరిగి రాకపోవడంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సాయం కోరారని చెప్పారు. 16 మంది యువకుల కుటుంబ సభ్యులు శుక్రవారం సీఎం పినరయి విజయన్ ను కలిశారు. కనిపించకుండా పోయిన వారు ఎక్కడున్నారో గుర్తించాలని కోరారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







