జిద్ హాఫ్స్ మార్కెట్ తొలగింపులు నిలిపివేత..!!

- May 01, 2025 , by Maagulf
జిద్ హాఫ్స్ మార్కెట్ తొలగింపులు నిలిపివేత..!!

మనామా: జిద్ హాఫ్స్ మార్కెట్‌లోని విక్రేతలపై తొలగింపు ఉత్తర్వులను నిలిపివేయాలని అత్యవసర పార్లమెంటరీ ప్రతిపాదన కోరింది. వ్యాపారులను సంప్రదించి సమీపంలోని ప్రత్యామ్నాయాన్ని పొందే వరకు తొలగింపులను నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించారు. విక్రేతలతో చర్చలు జరిగే వర, కొత్త స్థలాన్ని ఏర్పాటు చేసే వరకు స్టాళ్లను తొలగించడాన్ని నిలిపివేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని ప్రభుత్వాన్ని ఎంపీలు మహమూద్ ఫర్దాన్, హమద్ అల్ డోయ్, మమ్దౌ అల్ సలేహ్, మొహమ్మద్ అల్ రిఫాయ్, హిషామ్ అల్ అవధి కోరారు.  మెరుగైన ప్రత్యామ్నాయం లేకుండా బలవంతంగా తొలగింపులు చాలా మందిని ఆర్థికంగా ఇబ్బందుల్లో పడేస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఇప్పటికే అక్కడినుంచి విక్రేతలను బలవంతంగా తొలగించడం ప్రారంభించారని సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌ల నేపథ్యంలో ఎంపీలు ఈ మేరకు ప్రతిపాదనను తీసుకొచ్చారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com