యూఏఈలో స్వల్పంగా పెరిగిన ఇంధన ధరలు..!!
- May 01, 2025
యూఏఈ: యూఏఈలో ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయి.ఈ మేరకు ఇంధన ధరల పర్యవేక్షణ కమిటీ కొత్త ధరలను ప్రకటించింది.ఏప్రిల్‌లో ఉన్న ధరలతో పోలిస్తే ధరలను కొద్దిగా పెంచింది.
ఇంధన మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఇంధన ధరలను ప్రతి నెలా నిర్ణయిస్తారు. పంపిణీ సంస్థల నిర్వహణ ఖర్చులను జోడించిన తర్వాత, సగటు ప్రపంచ చమురు ధర ప్రకారం ఇంధన ధరలను పెంచడం లేదా తగ్గంచడం చేస్తారు.
ఇక తాజాగా పెరిగిన ఇంధన ధరలు మే 1 నుండి అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం యూఏఈలో సూపర్ 98 Dh2.58(ఏప్రిల్ ధరల Dh2.57), స్పెషల్ 95 Dh 2.47 (Dh2.46), ఇ-ప్లస్ 91 Dh 2.39 (Dh 2.38) గా నిర్ణయించారు.
మీరు నడిపే వాహనం రకాన్ని బట్టి, మే నెలలో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ పొందడానికి గత నెల కంటే 0.51, 0.74 మధ్య ఎక్కువ ఖర్చవుతుందని వాహన రంగ నిపుణులు తెలిపారు.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







