న్యూ ట్రాఫిక్ లా ఎఫెక్ట్..కువైట్ లో 72శాతం తగ్గిన ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- May 01, 2025
కువైట్: కొత్త చట్టం అమలులోకి వచ్చిన వారం తర్వాత కువైట్ అంతటా ట్రాఫిక్ ఉల్లంఘనలు దాదాపు 72 శాతం తగ్గాయని అంతర్గత మంత్రిత్వ శాఖ డేటాను విడుదల చేసింది. ఏప్రిల్ 22 నుండి 28 వరకు 6,342 ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగాయని, కొత్త నిబంధనల అమలుకు ముందు వారంలో 22,651 నమోదయ్యాయని డేటా తెలిపింది.
కొత్త చట్టం నేపథ్యంలో సీట్‌బెల్ట్ ఉల్లంఘనలు గణనీయంగా 71 శాతం తగ్గాయని, ఇది డ్రైవర్లలో "భద్రతా అవగాహన" ఎక్కువగా ఉందని సూచిస్తుందని పేర్కొంది. అయితే కఠినమైన నిబంధనల అమలుకు ముందు కాలంతో పోలిస్తే డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడకం 86 శాతం తగ్గిందని వెల్లడించింది. అదే సమయంలో రోడ్లపై వాహనాల విన్యాసాలు 89 శాతం తగ్గాయని తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







