గల్ఫ్ దేశాల నుండి వాహనాల దిగుమతి.. ఒమన్ కొత్త రూల్స్..!!
- May 01, 2025
మస్కట్: ఉపయోగించిన వాహనాల రాకపోకలను నియంత్రించడం, స్థానిక ఆటోమొబైల్ రంగానికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా ఒమన్ లో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. రాయల్ ఒమన్ పోలీస్ (ROP) జూలై 1 నుండి అమలులోకి వచ్చే విధంగా క్లియరెన్స్ సర్టిఫికేట్ వ్యవస్థను ఉపయోగించి వాహన దిగుమతులను ఆమోదించడాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ కస్టమ్స్ సంయుక్తంగా ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిపాయి.
న్యూ రూల్స్ ప్రకారం.. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల నుండి వాహన దిగుమతులను రిజిస్ట్రేషన్ దేశంలోని సమర్థ అధికారులు జారీ చేసిన అధికారిక ఎగుమతి సర్టిఫికేట్ ఉన్న వాటికి మాత్రమే పరిమితం కానుంది. GCC దేశాల నుండి ఉపయోగించిన కార్ల దిగుమతులు పెరగడంపై స్థానికంగా పెరుగుతున్న ఆందోళనల పేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







